సునయన..నువ్వు కేకమ్మా,సాంగ్ లో దుమ్ము రేపావుగా

దీప్తి సునయన.. సోషల్ మీడియా ప్రపంచంలో ఆమె ఓ సంచలనం. ఫేస్ బుక్, ఇనిస్ట్రగ్రామ్ లో ఆమె ఓ వైరల్. ఆమెకున్న ఫ్యాన్ పేజీలు కానీ హేట్ పేజీలు కానీ చూస్తే  ఓ సినిమా స్టార్ ని మించి ఉంటాయి.  యుట్యూబ్ డ్యాన్సులు మరియు డబ్ స్మాష్ వీడియోలతో ఫేమస్ అయిన దీప్తి.. ఆ మధ్యన  డ్యాన్సర్ షణ్ముఖ్  తో కలిసి   ”సీత.. ఐ యామ్ నాట్ వర్జిన్” అనే షార్ట్ ఫిలిం   కూడా చేసి సెన్సేషన్  అయ్యింది. ఇక రీసెంట్ గా రామ్ చరణ్ హీరోగా వచ్చిన రంగస్దలం చిత్రం షూటింగ్ టైమ్ లో సమంతతో కలిసి దిగిన ఓ ఫొటోను షేర్ చేయటంతో మెగా ఫ్యాన్స్ కు, అక్కినేని ఫ్యాన్స్ కు దగ్గరైపోయింది.   సునయనకు ఉన్న ఫాలోయింగ్ ఏ స్దాయిలో అంటే….ఎప్పుడైనా గ్యాప్ ఇస్తే ఏం జరుగుతోంది..ఏమైంది అంటూ ఆమెను సునామీలా ప్రశ్నలు చుట్టుముట్టేటంత. ఆమెకు ఇనిస్ట్రగ్రామ్ లో ఆరు లక్షలు మంది ఫాలోవర్స్ ఉన్నారంటే అసలు ఆశ్చర్యంపోనక్కర్లేదు. ఇవన్నీ ఇప్పుడెందుకు గుర్తు చేస్తున్నారు..ఇవన్నీ మాకు తెలిసున్నవే కదా అంటారా… ఇలా రోజు రోజుకీ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచేసుకుంటున్న ఈ  యూట్యూబ్ స్టార్… రంగస్ధలం చిత్రంలోని రంగమ్మ..మంగమ్మలోని ఓ పాటకు తనదైన స్టైల్ లో డాన్స్ చేసి దుమ్ము రేపింది. ఈ వీడియో  ఇప్పుడు యూట్యూబ్ లో సెన్సేషన్ గా మారింది. ఆ పాటలో చూపిన ఎక్సప్రెషన్స్..కొంటె చూపు, లవ్లీ స్మైల్ చాలా మందికి ఆమె అభిమానులకు తెగ నచ్చేస్తున్నాయి. మీరూ ఈ పాట వీడియోని ఇక్కడ చూడవచ్చు.  రంగమ్మ మంగమ్మ ఏం పిల్లడూ…పక్కనే ఉంటాడమ్మా పట్టించుకోడు అంటూ సాగే పాట ఈ పాటకు చంద్రబోస్‌ సాహిత్యం.. మానసి గాత్రం.. దానికి దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.   ఈ పాటలో సమంత లుక్కు కూడా బావుంటుంది. అదే సమయంలో ఈ రీమిక్స్ సాంగ్ లో సునయన కూడా అదరకొట్టింది.