ప్రోమో అదిరింది..ఓ సూపర్ హిట్ కు పునాది పడింది

మాటే మంత్రము మనసే బంధముఈ మమతే ఈ సమతే మంగళ వాద్యముఇది కళ్యాణం కమనీయం జీవితంమాటే మంత్రము మనసే బంధముఈ మమతే ఈ సమతే మంగళ వాద్యముఇది కళ్యాణం కమనీయం జీవితం
ఈ పాట ఇళయరాజాగారు స్వరపరిచిన సీతాకోక చిలక సినిమాలోది. బాలు,శైలజ కలిసి పాడిన ఈ యుగళగీతం పెద్ద హిట్ ..ఇప్పుడీ టైటిల్ తో ఓ ఓ ప్రోమో రిలీజైంది. 
కొన్ని బంధాలు మాటల యుద్దాలతో మొదలవుతాయి..ఆ మాటలే మంత్రాలుగా మారతాయి అంటూ ఓ ఫీల్ గుడ్ ట్రైలర్ ఒకటి రిలీజైంది. వీడియో క్వాలిటీ చూసి ..అంతా తెలుగులో రాబోతున్న ఓ సినిమా ప్రోమో అనుకున్నారు.  అయితే అది జీ తెలుగులో త్వరలో ప్రారంభం కాబోతున్న మాటే మంత్రము..మనసే బంధము అనే టీవి సీరియల్ ది అని తెలుసుకుని అవాక్కయ్యారు. 
తెలుగులో జూ.ఎన్టీఆర్ తో నా అల్లుడు, అల్లరి నరేష్ తో విశాఖ ఎక్సప్రెస్ వంటి చిత్రాలు రూపొందించిన దర్శకుడు ముళ్లపూడి వరా ఈ సీరియల్ ని డైరక్ట్ చేస్తున్నారు. ఇప్పటికే ఆయన డైరక్ట్ చేసిన పున్నాగ సీరియల్ తెలుగులో ఓ సంచలనం. ఈ నేపధ్యంలో ఈ టీవి సీరియల్ అంతటా హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా ఈ ప్రోమోకు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తోంది.