స్టార్‌ మా లో మహత్తరమైన రుద్రమదేవి సీరియల్‌ ప్రసారం కానుందని ప్రకటించిన బిగ్‌బాస్‌ సీజన్‌ 4 హోస్ట్‌ నాగార్జున

తెలుగు జీఈసీలో మొట్టమొదటిసారిగా చారిత్రాత్మక కథనం

చారిత్రాత్మకంగా మహోన్నతమైన రాణీ రుద్రమదేవి జీవిత కథతో తీర్చిదిద్దిన సీరియల్‌ను స్టార్‌మాలో ప్రసారం చేయడానికి సర్వం సిద్ధమైంది. ఈ షో మోషన్‌ పోస్టర్‌ ఇప్పటికే ప్రదర్శితం కాగా తొలిసారిగా ప్రోమో పై ప్రకటనను బిగ్‌బాస్‌ 4 తెలుగు ఫైనల్‌లో భాగంగా బిగ్‌బాస్‌ సీజన్‌ 4 హోస్ట్‌ నాగార్జున చేశారు.

రాణి రుద్రమదేవి కథ చరిత్రలో అసమానమైనది. యువరాణిగా రాజకుటుంబంలో జన్మించిన ఆమె, యువరాజుగా జీవితం సాగించడంతో పాటుగా శిక్షణ పొందుతూ సింహాసనాన్ని దుష్టశక్తుల బారినపడకుండా కాపాడుతుంది. మహిళలకు రాజ్యాధికారం పట్ల సమాజంలో ఉన్న భావనలను పోగొట్టడమే కాదు, చక్రవర్తిగానూ ఆమె అసమాన పోరాట పటిమ చూపారు. ప్రజాపరిపాలనకు సంబంధించిన జ్ఞానాన్ని ఆమె తన తండ్రి గణపతిదేవుని నుంచి నేర్చుకున్నారు. అపారమైన రాజకీయ పరిపాలన ఆయన సొంతం.

రాణీ రుద్రమదేవి చరిత్ర 13వ శతాబ్దానికే చెందినదైప్పటికీ మనచుట్టూ ఉన్న లింగవివక్షతను చూసినప్పుడు ఇప్పటికీ ఇది సంబంధితంగానే అనిపిస్తుంటుంది. స్ఫూర్తిదాయక మరియు వినోదాత్మకమైన కథలను తీసుకురావాలనే లక్ష్యంతో స్టార్‌ మా ఇప్పుడు ఈ మహత్తర కథనాన్ని ప్రేక్షకుల ముంగిటకు తీసుకువస్తోంది.

Similar Posts
Latest Posts from bullitera.com
Banner
Banner
Banner
Banner