• దేశంలోనే ఎక్కువ మంది వీక్షించే ఎంటర్ టైన్ మెంట్ ఛానెల్ గా స్టార్ మా అవతరించింది
• తాజాగా విడుదల అయిన రేటింగ్స్ లో స్టార్ మా ఈ ఘనత సాధించింది

సన్ టివిని దాటి స్టార్ మా ముందుకు వెళ్లి దేశంలోనే ఎక్కువ మంది వీక్షించే ఎంటర్ టైన్ మెంట్ ఛానెల్ గా అవతరించింది. తాజాగా విడుదల అయిన రేటింగ్స్ లో స్టార్ మా ఈ ఘనత సాధించిందని స్టార్ మా ఒక ప్రకటనలో తెలిపింది. అన్ని రీజినల్ ఛానెల్స్ లో ప్రత్యేక కార్యక్రమాలు రూపొందిస్తూ ముందుకు వెళుతున్న స్టార్ మా ఇప్పుడు దేశంలోనే నెంబర్ వన్ గా మారింది. బ్లాక్ బస్టర్ సినిమాలు, ప్రముఖ తారలతో కూడిన ఈవెంట్లు, లైవ్ కార్యక్రమాలు స్టార్ మా లో ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి.

తెలుగులో పాపులర్ సీరియల్స్ తో స్టార్ మా ముందున్నది. 42 శాతం వీక్షకులను ఆకట్టుకుంటున్న వదినమ్మ, కార్తీకదీపం, ఇంటింటి గృహలక్ష్మి, తాజాగా ప్రారంభమైన దేవత, కస్తూరి తదితర కార్యక్రమాలతో స్టార్ మా ముందుకు వెళుతున్నది. బిగ్ బాస్, సిక్స్త్ సెన్స్, ఇస్మార్ట్ జోడీ లాంటి రియాలిటీ షో లు కూడా మా టీవీని ప్రేక్షకులకు దగ్గర చేశాయి.

Similar Posts
Latest Posts from bullitera.com
Banner
Banner
Banner
Banner